Dept of Philosophy_Guest Lecture -The need of the Theosophy in the present world

రాజమహేంద్రవరం స్థానిక ఆర్ట్స్ కళాశాలలో తత్త్వశాస్త్ర మరియు మానసిక శాస్త్ర శాఖ వారు సంయుక్తంగా ఏర్పాటుచేసిన అతిధి ఉపన్యాసంలో శ్రీ సీతా రామచంద్ర రావు గారు, దివ్యజ్ఞాన తెలుగు సమాఖ్య అధ్యక్షులు  విద్యార్థులను ఉద్దేశించి "ప్రస్తుత సమాజంలో దివ్యజ్ఞాన అవశ్యకత" అనే అంశంపై ఉపన్యసించారు. ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న పరిస్థితులు - ఘర్షణ, విభజన, ద్వేషం, పగ  చోటు చేసుకుని ప్రపంచ శాంతికి ఆటంకం కలిగిస్తున్నాయని, దీనికి ముఖ్య కారణం మానవుని మనస్సు లోతుగా మత, కుల, జాతి, వివక్ష అనే భేదభావాలతో నిబద్దత అయింది, వీటివలనే ప్రపంచంలో ఈ విభజనలన్నింటికీ కారణం.  మనకు బాహ్యంగా కనబడే పరిస్థితులన్నీ మానవుని మనస్సు నుంచే వ్యక్తమగుచున్నవి, కాబట్టి మానవుని మనస్సునుంచే ముఖ్యంగా మార్పు రావాలి. అలాగే ప్రపంచంలో అభివృద్ధి సాధించిన మనిషి అంతరంగంలో శతాబ్దాలు గడిచినా ఏ విధమైన మార్పు సంభవించలేదు, దానికి పరిష్కారంగా సమాజంలోని జాతి మత కుల వర్ణ వివక్షలేని విశ్వమానవ సౌభ్రాతృత్వంతో ఒక అణుకేంద్ర నిర్మాణం ఏర్పరచాలని, దివ్యజ్ఞాన సమాజ మొదటి లక్ష్యం గురించి విద్యార్థులకు వివరించారు.

ఈ సమావేశంలో తత్త్వశాస్త్ర శాఖ ప్రధాన అధ్యాపకులు కె. ఆంజనేయులు గారు అతిధి ఉపన్యాసం గూర్చి విద్యార్ధులతో - మంచి ఆలోచనలతో ఆరోగ్యంగా జీవించవచ్చు. ఆలోచనా శుద్ధికి మానసిక శుద్ధి అవసరం అని, మానసిక ఆరోగ్యంతో ఎన్నో శారీరక సమస్యలను దూరం చేసుకోవచ్చని చెప్పారు. విశ్వమానవ సౌభ్రాతృత్వం, మానవత్వ సాధనకు, నైతిక విలువల్ని పెంపొందించుకొని సన్మార్గంలో జీవించాలని, అటువంటి జీవన విధానానికి దివ్యజ్ఞాన సమాజం వంటి అధ్యాత్మిక సంస్థలు చూపే మార్గాలను అనుసరించడం ద్వారా సాధించవచ్చని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో తత్త్వశాస్త్ర శాఖ ప్రధాన అధ్యాపకులు, వైస్ ప్రిన్సిపల్ కె. ఆంజనేయులు గారు,  దివ్యజ్ఞాన సమాజం రాజమహేంద్రవరం శాఖ కార్యదర్శి కె.వి గోపాలకృష్ణ గారు, జిడ్డు కృష్ణమూర్తి అధ్యయన కేంద్ర కార్యదర్శి ఏ.టి బాబాజీ గారు,  తత్త్వశాస్త్ర మరియు మానసిక శాస్త్ర శాఖ అధ్యాపకులు డి. సువర్చల గారు, జీ. రాకేశ్ గారు,  విద్యార్ధులు పాల్గొన్నారు. కార్యక్రమ సంధానకర్తగా మానసిక శాస్త్ర అధ్యాపకులు సాయిరామ్ పాటే వ్యవహరించారు.