College Song

ఎంతో చక్కని దీమా ఆర్ట్సు కళాశాల....!

పల్లవి:

ఎంతో చక్కని దీమా ఆర్ట్సు కళాశాల...!

భావి పౌరులను దిద్దే భవ్య కార్యశాల...!

గౌతమి ఒడిలో విరిసిన విద్యావనము...!

రాజమహేంద్రానికి ఇది తలమానికము...!

చరణం-1:

'మెట్కాఫ్' మహాశయుని ఆశయాలతో...

నూటఅరువదేండ్ల వారసత్వ దీప్తితో...

తెలుగు నేలపై వెలసిన ఘనవిద్యాలయము...

అటానమీచేత నేడు అగ్రగణ్యము...!

చరణం-2:

కూల్డ్రే, కందుకూరి, సర్వేపల్లి- గురువులుగా...

దామెర్ల, గాడిచర్ల, టంగుటూరి-శిష్యులుగా...

వెలుగులతో భాసించిన విద్యాశ్రమము...

విలువలతో శోభించే దివ్యాశ్రయము... !

చరణం-3:

భాషా, విజ్ఞానశాస్త్రములలో-మేటి...

సమాజ, వాణిజ్యశాస్త్రములలో-సరిసాటి...

కళా, సాంస్కృతిక, క్రీడా, సేవల-పటిమ...

నాక్'ఎ' గ్రేడుతోటి మెరసిన-గరిమ...!

చరణం-4:

పాలనాదక్షులకు, రాజనీతిజ్ఞులకు..

న్యాయకోవిదులకు, ఇదిచదువులనెలవు...

సమత, మమతపండించే-సస్యక్షేత్రం...

సమాజదేవాలయమిది-పుణ్యక్షేత్రం...!