రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు
25 జనవరి 2025: జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో జనవరి 23, 2025న విద్యార్థులకు “జాతి నిర్మాణం లో ఓటర్ పాత్ర” అనే అంశంపై వ్యాసరచన మరియు “ఓటు హక్కు ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం ఎలా” అనే అంశంపై ముఖాముఖి (ప్రసంగ) పోటీలను నిర్వహించారు.
ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులలో ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను, సమాజంలోని ఓటుహక్కు పై అవగాహనను పెంపొందించడం, మరియు ఓటర్ యొక్క బాధ్యతాయుతమైన పాత్రను తెలియజేయడం ఈ పోటీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ కార్యక్రమంలో భాగంగా పొలిటికల్ సైన్స్ విభాగానికి చెందిన అధ్యాపకులు డాక్టర్ కె. సీతామహాలక్ష్మి, సయ్యద్ ఫరాఎస్రూన్, కె.పి.బి.ఎల్. సరోజ, సిహెచ్. రామారావు, మరియు ఎ.శ్రీకాంత్ పాల్గొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ భావాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఓటర్ల బాధ్యత మరియు ప్రజాస్వామ్యంలో ఓటు విలువ దాని ప్రాముఖ్యత ప్రతి ఒక్కరి భాగస్వామ్యం విద్యార్దుల లక్ష్యంగా పనిచేస్తాం అని “Nothing Like voting, I vote for sure” అని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమం లో భాగంగా విధ్యార్ధులు అందరూ కలిసి 25-1-2024న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ కళాశాల స్వయంప్రతిపత్తి, రాజమహేంద్రవరం .రాజనీతి శాస్త్రవిభాగము మరియు Nss, Ncc విభాగాల ఆధ్వర్యంలో స్థానిక ఓటర్లలో ఓటు పట్ల అవగాహన, చైతన్యాన్ని కలిగించేందుకు, ఓటు యొక్క విలువను తెలిపేందుకు కళాశాల విద్యార్థులతో ఆర్ట్స్ కళాశాల నుండి ఆనం కళా కేంద్రం వరకు ప్లకార్డులతో, ఈనాటి ఓటు -రేపటి జీవన సాఫల్యానికి మెట్టు వంటి పలు నినాదాలతో భారీగా ర్యాలీ నిర్వహించడం జరిగింది . ర్యాలీ అనంతరం ఆనం కళా కేంద్రంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవానికి విద్యార్థులంతా హాజరయ్యారు . జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి గారు మాట్లాడుతూ డబ్బుకి ఓటు అమ్ముకోవడం తప్పు,ప్రజా సమస్యలకు ఓటే ఒక వజ్రాయుధం అంటూ ఓటర్లు, విద్యార్థుల్లో చైతన్యాన్ని కలిగించారు. దీనిలో భాగంగా ఏర్పాటుచేసిన నృత్య ప్రదర్శనలను, ఓటర్లలలో చైతన్యాన్ని నింపే నాటికలను విద్యార్థులంతా తిలకించారు . 24 -1- 2025 న కళాశాలలో నిర్వహించిన వ్యాసరచన, గ్రూప్ డిస్కషన్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ పోతురాజు బాబ్జి, రాజనీతి శాస్త్ర అధ్యాపకురాలు ఫరా ఎశ్రూన్ , NCC విభాగాధిపతి భాషా, Ncc,Nss కోఆర్డినేటర్లు, డాక్టర్ బి మల్లికార్జున్, డాక్టర్ డి.భవాని, కే పీ బి ఎల్ సరోజ, సిహెచ్ రామారావు, ఏ. శ్రీకాంత్, శంకర్ , రాణి, కుసుమ PET లక్ష్మీ ,విజయ్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.